కిరణ్ బేడీపై మండిపడుతున్న నెటిజన్లు…

187
Kiran-Bedi-as-Governer-of-Puducherry
- Advertisement -

రష్యా వేధికగా జరిగిన ఫిఫా-2018 వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. క్రొయోషియాపై ఫైనల్ మ్యాచ్ లో అద్భుతం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ఫ్రాన్స్ జట్టుకు తెలిపిన అభినందలు వివాదంగా మారాయి. ఆమె చేసిన ట్వీట్ పై నెటిజన్లు విరుచుపడుతున్నారు.

kiran bedi

ప్రాన్స్ గెలిచిన వెంటనే పుదుచ్చేరి వాసులు ప్రపంచకప్ గెలుచుకున్నారా..? అభినందనలు, క్రీడలే ఐక్యతకు చిహ్నం అంటూ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. మేం భారతీయులం, ఫ్రెంచ్ వలస దారులం కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. గౌరవ ప్రదమైన స్థానంలో ఉండి ఇలా ట్వీట్ చేయడం సబబు కాదని సూచిస్తున్నారు. ఇలాంటి చెత్త పబ్లిసిటీ స్టంట్లు ఆపాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

- Advertisement -