టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్..

37
csk

దుబాయ్‌లో వేదికగా ఐపీఎల్‌-13లో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టులో పలు మార్పులు చేశారు. కరుణ్ నాయర్, జిమ్మీ నీషామ్, గౌతమ్ స్థానంలో మన్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు.ఇక చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

టోర్నీ ఆరంభంలో గట్టి జట్లుగా భావించిన చెన్నై, పంజాబ్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. నాలుగేసి మ్యాచ్ లు ఆడి, మూడు సార్లు ఓడాయి. ఒకే ఒక్క విజయం నమోదు చేసుకున్నాయి. కీలకమైన మరో గెలుపు కోసం ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి.