మొక్కలు నాటిన మంత్రి నిరంజన్ రెడ్డి..

100
Minister Niranjan Reddy

రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. నేడు ఆయన పుట్టిన రోజు సంధర్భంగా వనపర్తి సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సతీమణి వాసంతి, కూతుళ్లు, అల్లుళ్లు, మనవరాళ్లతో కలిసి రావి, నెమలినారు, చైనా బాదం మొక్కలను నాటారు.