రాజస్ధాన్ పై విజయం సాధించిన పంజాబ్

219
punjab won
- Advertisement -

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. నిన్న రాత్రి జైపూర్ లో రాజస్ధాన్ తో జరిగిన మ్యాచ్ లో 14పరుగుల తేడాతో బోణి కొట్టింది. టాస్ గెలిచిన రాజస్ధాన్ రాయల్స్ టీం ఫిల్డింగ్ ఎంచుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 184పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్, సర్ఫరాజ్ ఖాన్ లు అద్భుతంగా ఆడారు క్రిస్ గేల్ 47బంతుల్లో 79 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 29బంతుల్లో 46పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కే.ఎల్ రాహుల్ 4పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రాజస్థాన్‌ బౌలర్లలో స్టోక్స్‌ 2.. కులకర్ణి, గౌతమ్‌ తలో వికెట్‌ తీశారు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ టీం పొరాడి ఓడిపోయింది.

ఓపెనర్లు అజింకా రహానే, బట్లర్లు పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రహానే 20బంతుల్లో 27 పరుగులు చేయగా, బట్లర్ 43బంతుల్లో 67పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన సంజూ సామ్సన్ 30 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 17వ ఓవర్లో స్మిత్‌, శాంసన్‌లు పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌ పంజాబ్‌ వైపు తిరిగింది. రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది. పరుగుల వేటలో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కొంతమేరకు సఫలీకృతమైనప్పటికీ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. పంజాబ్‌ బౌలర్లలో ముజీబ్‌ రెహ్మాన్‌, అంకిత్‌, కర్రాన్‌ చెరో 2 వికెట్లు తీశారు.

- Advertisement -