కింగ్ ఆఫ్ కోత…సెన్సార్

30
- Advertisement -

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది.

పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు సభ్యులు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ సురేష్ కీలక పాత్రలు పోషించారు. ‘కింగ్ ఆఫ్ కొత’ అద్భుతమైన కంటెంట్‌కు ప్రసిద్ధి పొందిన రెండు పవర్ హౌసస్ జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఓనం కానుకగా 24 ఆగస్టు, 2023న విడుదల కానుంది.

Also Read:మహేష్‌తో అక్కడ ప్లాన్ చేశాడు!

- Advertisement -