మొక్కలు నాటిన కిమ్స్ ఆసుపత్రి ఎండీ డా. భాస్కర్ రావు

404
KIMS MD
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సన్ షైన్ ఆస్పత్రి ఎండీ గురువారెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించారు సికింద్రబాబ్ కిమ్స్ ఆస్పత్రి ఎండీ డా. భాస్కర్ రావు. సికింద్రబాద్ లోని కిమ్స్ ఆస్పత్రి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా డా.భాస్కర్ రావు మాట్లాడుతూ…. ఎంపీ సంతోష్ కుమార చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి కార్యక్రమం అన్నారు. స్వచ్చమైన గాలికోసం ప్రతీ ఒక్కరు ఒక్కొ మొక్క నాటాలి అని పిలుపునిచ్చారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురికి సవాల్ విసిరారు. బీఎస్ సీపీఎల్ ఎండీ బీ.శీనయ్య, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ కమిషనర్ రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లకు మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిథులు రాఘవ, కిషోర్ గౌడ్ లు పాల్గోన్నారు.

Kims

- Advertisement -