చరిత్రాత్మకం…దక్షిణకొరియాలో కిమ్ జాంగ్

269
Kim Jong Un meets Moon Jae
- Advertisement -

అద్భుతం ఆవిష్కృతమైంది. ఉప్పు నిప్పు కలిశాయి. 65 ఏళ్ల వైరాన్ని పక్కనబెట్టి బద్దశత్రువులైన ఉత్తర కొరియా,దక్షిణ కొరియా దేశాధినేతలు కలిశారు. ఈ చారిత్రాక సమావేశానికి దక్షిణకొరియా సరిహద్దులోని పన్‌ముంజుమ్‌ వేదికైంది. ఇరుదేశాల మధ్య ఉన్న వైరాన్ని పక్కనబెట్టి శాంతిబాట పట్టారు కిమ్‌ జాంగ్‌,మూన్‌ జే ఇన్‌.

1953లో రెండు దేశాలు విడిపోయాయి. ఆ తర్వాత ఉత్తర కొరియా నేతలెవ్వరూ దక్షిణ కొరియాలో ఎంటర్ కాలేదు. మొదటిసారి నార్త్ కొరియా అధినేత మిలిటరీ లైన్ దాటి సౌత్ కొరియాలోకి ప్రవేశించారు. ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కిమ్‌ చిరునవ్వుతో మూన్‌ జే ఇన్‌తో కరచాలనం చేశారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు.

Kim Jong Un meets Moon Jae

పన్‌ముంజుమ్‌లోని పీస్‌ హౌస్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. కొత్త చరిత్ర ప్రారంభానికి ముందు సానుకూల సంకేతాలు ఇవ్వడానికి .. నిజాయితీతో, స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు కిమ్ జాంగ్. ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి అవుతుందని మూన్‌ అన్నారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా సదస్సుకు హాజరయ్యారు. ఇరు దేశాల అధ్యక్షులు షెకండ్ ఇచ్చుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలోనే కిమ్‌ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది.

Kim Jong Un meets Moon Jae

Kim Jong Un meets Moon Jae

- Advertisement -