- Advertisement -
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్ధితిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కిమ్‌కు ఏప్రిల్ మొదటివారంలో హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటినుండి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న కిమ్ ఓ ప్రైవేట్ విల్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఉత్తరకొరియా అధికారులు పేర్కొనగా యుఎస్ మాత్రం ఇందుకు భిన్నంగా కిమ్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని వార్తలు ప్రచురించింది.
ఎందుకంటే ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాలేదు. దీనికితోడు ఆయన ఆరోగ్య పరిస్ధితి సోమవారం విషమించిందని యుఎస్ అధికారులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారగా ఉత్తర కొరియా నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
- Advertisement -