జబర్దస్త్ కమెడియన్‌పై కిడ్నాప్ కేసు..

332
Kevvu Karthik
- Advertisement -

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఈయనపై కిడ్నాప్, దాడి కేసు నమోదైంది. బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ ఉంది. ఈ షోలో నటించిన ఎందరో నటులు సినీ రంగంలో అవకాశాలను చేజిక్కించుకుని రాణిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిచయమైన కమెడియన్ కెవ్వు కార్తీక్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా కార్తీక్ పై మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో దాడి, కిడ్నాప్ కేసు నమోదైంది.

ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ, తన సోదరి భర్తపై స్నేహితులతో కలిసి కార్తీక్ దాడి చేసినట్టు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. ఐదుగురు వ్యక్తులతో కలసి కార్తీక్ దాడి చేశాడని బాధితుడు రవి కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. తనను కిడ్నాప్ చేసి 15 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లారని, అక్కడ తనను కొట్టించాడని చెప్పారు. కార్తీక్ తో పాటు, అతని తల్లిదండ్రులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే ఈ ఘటనపై కార్తీక్ ఇంకా స్పందించలేదు.

- Advertisement -