నా కూతురు నా లాగా మారకూడదు!

2
- Advertisement -

బాలీవుడ్ స్టార్ నటి కియారా అద్వానీ..తన ప్రెగ్నెన్సీ, మాతృత్వం గురించి ఇటీవల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కుమార్తె సారాయా (Saraayah) పెరిగి పెద్దయ్యాక తనలోని ఒక లక్షణం ఆమెకు రాకూడదని కియారా కోరుకుంటున్నారు.

తనకు అందరినీ మెప్పించాలని చూసే స్వభావం ఉందని, అది తనలో ఉన్న ఒక బలహీనత అని పేర్కొన్నారు. కానీ తన కుమార్తె సారాయా మాత్రం తనలాగా ఇతరులను మెప్పించడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదులుకునే అమ్మాయిలా మారకూడదని ఆమె ఆకాంక్షించారు.

తన కుమార్తె తనకంటూ ఒక బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని, తన నిర్ణయాలను ధైర్యంగా చెప్పుకోగలిగేలా పెరగాలని కియారా ఆశాభావం వ్యక్తం చేశారు.తల్లిగా మారిన తర్వాత తన ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు తన ప్రాధాన్యతలు అన్నీ తన బిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ 2023లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట తమ కుమార్తెకు ‘సారాయా’ అని నామకరణం చేశారు.

Also Read:BRS:రేపు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

- Advertisement -