కియా మోటార్స్ ఇకపై కియా ఇండియా!

77
kia

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ దేశంలోని ఏపీ అనంతపురం జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగత తెలిసిందే. ఇక్కడి నుండి దేశం మొత్తం కియా కార్ల ఉత్పత్తి జరుగుతుండగా ఆ సంస్ధ కార్లకు మంచి స్పందన లభిస్తోంది.

ఈ నేపథ్యంలో కియా మోటార్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ కియా మోటార్స్ పేరును కియా ఇండియాగా మార్చింది. లోగోలో కూడా ఈ మార్పులు చేసింది. ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ద్ద కూడా క్ర‌మ‌ప‌ద్ద‌తిలో పేరును మార్పు చేస్తున్న‌ది. కొన్ని రోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని ఆ సంస్థ వెల్లడించింది.