మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడీ చిత్రాన్ని సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మూడవపాట “అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే`ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్‌కు ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్‌తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు. ‘అట్టా సూడకే’ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ – మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.
నిర్మాతలు ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్
సాంకేతిక బృందం
కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

