గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్…

147
khammam collector
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ . కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్ కుమార్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు కలెక్టరేట్ లో మొక్కలు నాటారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ గారికి కృతజ్ఞతలు .పర్యావరణ పరిరక్షణపైనా మంచి అవగాహనా కల్పిస్తుంది . హరితహరం కి మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజవంతకొనసాగుతుంది అని , ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమం ఒకరి ద్వారా మరొకరికి చేరేలా , ప్రతి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటే విదంగా చేస్తా అన్నారు . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరో ముగ్గురికి నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేర్ , వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా ముష్రాత్ కణం గార్లకి ఛాలెంజ్ చేశారు .

- Advertisement -