ఖమ్మం జిల్లాలో పుస్తక ప్రదర్శన ప్రారంభం..

499
Khammam Book Fair
- Advertisement -

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయ పుస్తక ప్రదర్శన జరిగింది. జిల్లావ్యాప్తంగా 140 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తి పెంపొందించేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో తోడ్పడుతుంది. పాఠశాలల్లో పుస్తక ప్రదర్శన కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

ఖమ్మం రిక్కా బజార్ స్కూల్‌లో పుస్తక ప్రదర్శనను బీసీ కమిషన్ సభ్యులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్, జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్. మేయర్ పాపాలాల్, గ్రంథాలయ చైర్మన్ ఖమర్, డీఈఓ మదన్ మోహన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ.. కలెక్టర్ కర్ణన్‌కి పుస్తకాల మీదున్న ప్రేమ వల్లనే పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైన ఈ పుస్తక యాత్ర రాష్ట్ర వ్యాపితం చేస్తాం.పుస్తకం అసలైన నేస్తమని శంకర్‌ తెలిపారు.మనిషికి ఆస్తులు, హోదాలు ఉండటం కాదు. ఆత్మస్థైర్యం కావాలంటే పుస్తకం చదవాలి అన్నారు. బాలబాలికలు సమాజంలో ఉన్నతులు అయ్యేందుకు పుస్తకాలు దోహదపడతాయని ఆయన తెలియజేశారు.

కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ..గౌరీ శంకర్ పుస్తక ప్రదర్శన విద్యార్థి జీవితంలో కొత్త మార్పు తీసుకువస్తుంది. జీవితం, సమాజం గిరించి తెలుసుకునేందుకు విద్యార్థులు పుస్తకాలు చదవాలని కలెక్టర్‌ అన్నారు.పుస్తక పఠనం జీవితంలో భాగం చేసుకోవాలి.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బహుమతులుగా పుస్తకాలు అందించాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

- Advertisement -