బైబై గణేశా..గంగమ్మ ఒడిలోకి గణనాథుడు

5
- Advertisement -

11 రోజులపాటు ఘనంగా పూజలు అందుకుకున్న ఖైరతాబాద్ గణపతి గంగమ్మ చెంతకు చేరాడు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనానికి సూపర్ క్రేన్‌ను ఉపయోగించారు. భారీ గణపయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ ఒడికి చేరడంతో అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాలు కొక్కిరిసిపోయాయి.

భక్తులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. భారీ కొక్కేలకు తగిలించిన వినాయకుడిని నిదానంగా హుస్సేన్ సాగర్ నీటిలోకి దించారు. విగ్రహం పూర్తిగా మునగడంతో నిమజ్జనం పూర్తయింది. వినాయక నిమజ్జనం సందర్భంగా గణనాథుని నామ స్మరణతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేవంత్‌ను చూసిన ప్రజలు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నబాబును సీఎం రేవంత్‌రెడ్డికి ఎత్తుకొమని ఇచ్చారు. వెంటనే ఆ బాబును సీఎం రేవంత్‌ ఎత్తుకొని ఆడించారు.

ఉదయం 6:15గంటలకు ఖైరతాబాద్ గణేష్‌ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ వినాయకుణ్ని పెట్టడం మెుదలుపెట్టి 70ఏళ్లు అయిన సందర్భంగా ఈ యేడాది 70అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి పూజలు అందుకున్నారు.

Also Read:బాలాపూర్ లడ్డూ చరిత్ర…

- Advertisement -