యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ `పిట్ట‌గోడ`

288
- Advertisement -

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘పిట్టగోడ`. ఈ సినిమా డిసెంబ‌ర్ 24న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ప్రాణం కమలాకర్ ఆదివారం పాత్రికేయుల‌తో సినిమా సంగ‌తుల‌ను ముచ్చ‌టించారు…

ఒక‌రోజులు నిర్మాత రామ్మోహ‌న్‌గారు ఫోన్ చేసి పిట్ట‌గోడ సినిమాకు సంగీతం అందించాల‌ని నన్ను కోరారు. అయితే నేను అవున‌ని కానీ, కాద‌ని కాని రెస్పాండ్ కాలేదు. అయితే అప్ప‌టికే సాంగ్స్‌కు సంబంధించిన మాంటేజ‌స్ షూట్ చేసేసి ఉండ‌టంతో రామ్మోహ‌న్‌గారు నాకు ఫోన్ చేసి పాట‌లు విని అవి న‌చ్చితేనే సినిమాకు సంగీతం అందిచ‌మ‌ని అన్నారు. నేను మాంటేజ్ సాంగ్స్ చూశాను. సినిమాలో మంచి మ్యూజిక్‌కు స్కోప్ ఉండ‌టంతో సినిమాకు సంగీతం అందించ‌డానికి ఒప్పుకున్నాను.

Youth Full Entertainment Movie Pittagoda

నేను సినిమాలకు సంగీతం అందించ‌డం మాన‌లేదు, మానేయాల‌నుకోలేదు. నేను దాదాపు ముప్పై ఏళ్లుగా ఆర్‌.డి.బ‌ర్మ‌న్ నుండి ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ల‌తో వ‌ర్క్ చేశాను. ఇప్పుడు రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న 2.0 సినిమా మ్యూజిక్ గ్రూప్‌లో కూడా వ‌ర్క్ చేస్తున్నాను. ఇలా మంచి అనుభ‌వ‌మున్న‌వారితో వ‌ర్క్ చేస్తుండ‌టం వల్ల నేను సంగీతం అందించే సినిమాలు త‌గ్గిపోయాయి.

సాధార‌ణంగా ఇప్పుడు కొన్ని సినిమాలకు కొంత మంది సంగీతం అందిస్తే, మ‌రి కొంద‌రు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయితే అలా చేయ‌డం నాకు ప‌ర్స‌న‌ల్‌గా ఇష్టం ఉండ‌దు. ఇక పిట్ట‌గోడ సినిమాకు సంగీతం, నేప‌థ్య సంగీతం రెండూ నేనే అందించాను.

ఈ సినిమాలో మొద‌టి సాంగ్ తెలంగాణ యాస‌లో ఉంటుంది. తీయ తీయ‌ని…పాట‌, జ‌రిగెనే సాంగ్ ఇలా సాంగ్స్ అన్నీ నాకు ఇష్ట‌మైన‌వే. పిట్ట‌గోడ వంటి డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ్యూజిక్ చేయ‌డం హ్యాపీ.

Youth Full Entertainment Movie Pittagoda

మంచి టీంతో పనిచేశాను. విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి, డైరెక్ట‌ర్ అనుదీప్‌, నిర్మాత రామ్మోహ‌న్ ఇలా మంచి ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఓ టీంగా ఏర్ప‌డి మంచి అవుట్‌పుట్‌తో సినిమాను చేశాం.

- Advertisement -