యూఎస్‌లో దూసుకుపోతున్నా ఖైదీ….

188
- Advertisement -

ఖైదీ ఫీవర్‌తో తెలుగు రాష్ట్రాలు మార్మోగిపోతున్నాయి. తొమ్మిది సంవత్సరాల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెరమీదకు వచ్చిన ఫ్యాన్స్‌…మెగా ఫ్యామిలీకి నిజమైన సంక్రాంతి నందించాడు. ఉదయం 4 గంటల నుంచే థియేటర్లు బాస్ ఈజ్ బ్యాక్ అన్న నినాదాలతో మార్మోగిపోయాయి. సినిమాకు హిట్ టాక్ రావటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటారు.

Khaidi No 150 US box office collection

అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ మెగాస్టార్ రికార్డ్ ల వేట మొదలు పెట్టాడు. సూపర్ హిట్ సినిమాలు కూడా వారాంతానికి గాని సాధించలేని మిలియన్ మార్క్ ను మెగాస్టార్ ప్రీమియర్ షోస్ తోచే సాధించేశాడు. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కన్నా ముందే ఓవర్ సీస్ లో ఖైదీ నంబర్ 150 ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ముఖ్యంగా తొమ్మిదేళ్ల తరువాత తమ అభిమాన నటుణ్ని హీరోగా తెర మీద చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. దీంతో అన్ని ప్రీమియర్ షోస్ పూర్తి కాకముందే ఖైదీ నంబర్ 150 సినిమా మిలియన్ మార్క్ ను దాటేసింది. అమెరికాలోని 123 లొకేషన్స్ లో రిలీజ్ అయిన ఖైదీ, 1,133,615 డాలర్లకు పైగా వసూళు చేసింది. ఖైదీ కన్నా ముందు 1.36 మిలియన్ డాలర్లతో ఒక్క బాహుబలి మాత్రం తొలి రోజు ఓవర్ సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ లో ఉంది. ప్రీమియర్స్ షోస్ అన్ని పూర్తయ్యే వరకు ఇదే జోరు కొనసాగితే బాహుబలి రికార్డ్ ను ఖైదీ నంబర్ 150 క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ విషయాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున తరువాత మిలియన్ మార్క్ సాధించిన హీరో చిరునే కావటం విశేషం.

Khaidi No 150 US box office collection

‘ఖైదీ నంబర్‌ 150’ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో హీరో అల్లు అర్జున్‌ హల్‌చల్‌ చేశారు. భార్య స్నేహారెడ్డితోపాటు చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులు థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు.

ఈ సందర్భంగా స్టైలిష్‌ స్టార్‌ బన్నీ థియేటర్‌లో గుమిగూడిన మెగా అభిమానులకు అభివాదం చేసి.. అలరించారు. బన్నీ రాకతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొని.. స్వల్ప తోపులాట జరిగింది. థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ తెలిపాడు.

Khaidi No 150 US box office collection

ఐమాక్స్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను, కొరటాల శివ, కొన వెంకట్‌, విజయేంద్ర ప్రసాద్‌ ఇలా పలువురు సినీ ప్రముఖులు తొలిరోజే సినిమాను చూశారు. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులను అలరించేరీతిలో ఉందనే సోషల్‌ మీడియాలో పలువురు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు. తమిళంలో మురగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘కత్తి’ సినిమాకు రీమేక్‌గా ‘ఖైదీ నంబర్‌ 150’ వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -