గుంటూరోడు ట్రైలర్ విడుదల…..

88

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా S.K. సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం గుంటూరోడు.. ఈ చిత్రం ధియేట్రికల్ ట్రైలర్ ని ‘పద్మశ్రీ కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు’ గారు విడుదల చేసారు.. అనంతరం అయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా వుందని.. దర్శకుడు సత్య ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారని, తప్పకుండా ఈ చిత్రం మనోజ్ బాబు కెరియర్లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.. దర్శకుడు సత్య మాట్లాడుతూ ఈ మద్య విడుదల చేసిన టిజర్ కి అద్భుదమైన రేస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు ఈ ట్రైలర్ మోహన్ బాబు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది.. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులుని అలరిస్తుందని తెలిపారు.. అనంతరం ప్రొడ్యూసర్ శ్రీ వరుణ్ అట్లూరి మాట్లాడుతూ జనవరి చివరి వారం లో ఆడియో ని విడుదల చేసి ఫిబ్రవరి 10 న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు .. ఇంకా ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ బాబు , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రభు తేజ పాల్కొన్నారు.

Gunturodu Trailer Launch By Mohanbabu

మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం .. సంగీతం: శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్, కో– డైరెక్టర్ T. అర్జున్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య