చిరంజీవి ఖైదీ నంబర్ 150 ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే ఖైదీ ట్రైలర్ ను 30 లక్షల మంది వీక్షించారు. బాలయ్య శాతకర్ణి ట్రైలర్ తో పోలిస్తే.. ఇది ఎక్కువే. అయితే శాతకర్ణి ట్రైలర్ ఒక్క మిస్టేక్ ఉంటే.. ఖైదీ ట్రైలర్ లో లెక్కలేనన్ని తప్పులు వెలుగు చూస్తున్నాయి. ఇంతకీ ఏంటా తప్పులు.. ఓ సారి చూద్దాం..
చిరంజీవి సీరియస్ గా డైలాగ్ చెబుతుంటే.. సేమ్ టైమ్.. ఆలీ పక్కన ఉన్న కాజల్ నవ్వడం. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటది అన్నట్లుగా కోర్టు సీన్లో ఇందిరా గాంధీ ఫోటో కనిపించడం. చిరంజీవి మీడియాతో మాట్లాడుతున్న సీన్లో వెనకాల కనిపించే జనాన్ని కాపీ పేస్ట్ లాగా.. మళ్లీ మళ్లీ చూపించడం. ట్రైలర్ లో జనాలు బాగా కనిపిస్తున్న అన్ని సందర్బాల్లో ఇలాంటి అతుకుల బొంతలాంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయి. ఇక తమిళ్ కత్తిని నుంచి సీన్లను కూడా మక్కీకి మక్కీగా దించేశారు. కారు బోల్తా పడే సీను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
అంతే కాదు ఆ సమయంలో వచ్చే మ్యూజిక్ లో కూడా ఎలాంటి మార్పులేదు. రీమేక్ చిత్రాలు తీసేటప్పుడు నేటివీటికి తగ్గట్టు మార్పులు చేయడం జరుగుతుంది. ఇటీవల చైతు రీమేక్ చేసిన ప్రేమమ్ మూవీని అలానే పూర్తిగా తెలుగు నేటివీటికి తగ్గట్లు మార్చారు. అయితే తమిళ చిత్రం తనీ ఒరువన్ ను రీమేక్ చేసిన చరణ్ మాత్రం ఎక్కడా ఎలాంటి మార్పులు లేకుండానే సినిమా చేసి, మాతృకను తెరకెక్కించిన దర్శకనిర్మాతల గౌరవాన్ని కాపాడాడు. ఈ నేపధ్యంలో కత్తికి రీమేక్ గా తెరకెక్కిన ఖైదీ మూవీ ఎలా ఉండబోతుందనన్నది ఆసక్తికరంగా మారింది.