చిరును ఇబ్బందిపెట్టిన సురేఖ

95
Chiranjeevi about his Wife Surekha

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల పాటు సినిమాలు దూరం ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దాదా జిందాబాద్ తరువాత మళ్లీ తెరపై ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించలేదు. ఈ గ్యాప్ లో చరణ్ నటించిన మగధీర, బ్రూస్లీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ ను మళ్లీ సినిమాల్లో చూస్తామా అని, ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణంలో ఇన్నాళ్లకు మళ్లీ ఖైదీ నంబర్ 150 మూవీతో బాక్సాఫీస్ బరిలో దూకబోతున్నారు.

అయితే సినిమాలకు దూరమైనప్పటి నుంచి చిరు ఫిజిక్ విషయంలో శ్రద్ధ చూపించలేకపోయారు. దీంతో రీఎంట్రీ మూవీకోసం చాలానే శ్రమించారు. తాను స్లిమ్ గా తయారవ్వడానికి తాను చాల కఠినమైన శిక్షణ తీసుకోవలసి వచ్చిందని స్వయంగా చిరంజీవే తెలిపారు. ఇదుకోసం ఒక జిమ్ కోచ్, మరొక డైటీషియన్‌లను ఫుల్‌టైమ్‌గా తనవద్దనే పెట్టుకుని ఎంతో కష్టపడ్డారట.

అయినప్పటికీ, చిరు డైటింగ్ విషయంలో చాలా ఇబ్బందులే పడ్డారు. అయినప్పటికీ,చిరు సతీమణి సురేఖ ఏ మాత్రం కనికరించలేదట. తన డైటింగ్ విషయంలో చాల కర్కశంగా వ్యవహరించిందని సురేఖపై సెటైర్లు కూడా వేశారు చిరు.