Khaidi@42..స్పెష‌ల్ వీడియో

9
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన క్లాసిక్ సినిమా ఖైదీ. 1983 అక్టోబర్ 28న విడుదల కాగా నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి. ఖైదీ కేవలం ఓ సినిమా కాదు ,టాలీవుడ్ రూపురేఖలనే మార్చేసిన రివల్యూషన్ మూవీగా నిలిచింది.

ఈ చిత్రం 42 ఏళ్లు పూర్తైన సంద‌ర్భంగా చిరంజీవి టీమ్ స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేయ‌గా, ఇది నెట్టింట వైర‌ల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాతే చిరు పూర్తి కథ విన్నారట. పరిచూరి బ్రదర్స్‌పై ఉన్న విశ్వాసంతో ఆయన ఎటువంటి సందేహం లేకుండా సినిమా చేయడానికి అంగీకరించారు.

చిరంజీవి ఈ సినిమాకి రూ.1.75 లక్షల పారితోషికం అందుకున్నారు. కోదండరామిరెడ్డి రూ.40 వేలే తీసుకున్నారు. కానీ ఫలితం మాత్రం ఆకాశాన్నంటింది. రూ.25 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.70 లక్షల బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ రోజుల్లోనే సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శించబడింది.

Also Read:BB9:కళ్యాణ్‌ గాలి తీసిన శ్రీజ!

- Advertisement -