- Advertisement -
మొంథా తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాంచీపురం, తిరునల్వేలి, కన్యాకుమారిలో కుండపోత వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. తీవ్ర తుఫాన్‌గా మొంథా బలపడగా తుఫాన్ ప్రభావంతో అంతకంతకూ గాలుల తీవ్రత పెరుగుతోంది.
గరిష్టంగా 100-110 కి.మీకు ఈదురుగాలుల తీవ్రత చేరగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Also Read:ప్రపంచంలోనే మొదటి స్కై స్టేడియం
- Advertisement -

