హీరో కాదు విలన్‌..కేజీఎఫ్‌ ట్రైలర్

355
kgf trailer
- Advertisement -

ఈ మధ్య కాలంలో పీరియడ్ డ్రామాలు-సీక్వెల్ సినిమాల హవా సాగుతుంది. ఈ నేపథ్యంలో కన్నడ హీరో యశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా `కేజీఎఫ్`. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఏ ఫిలింస్ – ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్దున్నారు.

ఇక వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం,హిందీలో విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ కన్నడ సినిమాలో, రమ్యకృష్ణ .. నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచిరెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ’నువ్వు నాక ఒక మాటివ్వాలి.. నువ్వెలా బతుకుతావో నాకు తెలియదు.. కానీ చనిపోయేటప్పుడు మాత్రం కోటీశ్వరుడిలా చావాలని’.. ఓ తల్లి తన కొడుకుతో ప్రమాణం చేయించుకునే సన్నివేశం తర్వాత హీరో కాదు విలన్‌ అంటూ సాగే ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

1970లో అమెరికా, రష్యా మధ్య జరిగిన గొడవ దాదాపు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోయింది. ఆ సమయంలో బంగారం ధరలు మిన్నంటాయి. అతి పెద్ద అతిపెద్ద బంగారు గని కేజీఎఫ్…ఈ గనిని ఒకే ఒక్కడు అదుపు చేస్తే ఎలా ఉంటుందనేదే సినిమా స్టోరీ.

- Advertisement -