జనవరి 8న కేజీఎఫ్‌ 2 టీజర్…

100
kgf 2

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్‌. మాఫియా నేపథ్యంలో కన్నడ,హిందీ,తెలుగు,తమిళ్‌ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అన్నిభాషల్లో కలిపి ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇక కేజీఎఫ్‌ 2కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు నిర్మాతలు. జ‌న‌వ‌రి 8 ఉద‌యం 10.18ని.ల‌కు చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. కేజీఎఫ్‌ 1 విడుదలైన డిసెంబర్ 21న పార్ట్ 2కు సంబంధించిన మేజర్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. కేజీఎఫ్‌ 2 మొత్తాన్ని 120 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.