ఇర్మా….. బేబి

202
Key West woman who fled to Miami gives birth to girl named
- Advertisement -

అమెరికా చరిత్రలో ఇర్మా తుపాను కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టిస్తోంది.  కరీబియన్‌ దీవుల్ని.. క్యూబాని అతలాకుతలం చేసిన ప్రళయభీకర ఇర్మా హరికేన్‌ బీభత్సమిది. ఒకదశలో కేటగిరీ-3 హరికేన్‌గా తీవ్రత తగ్గిందని అధికారులు ఊపిరి పీల్చుకునే లోపలే.. మళ్లీ కేటగిరీ-4 హరికేన్‌గా బలపడింది. మియామీ మీదుగా వస్తుందని అంచనా వేస్తే.. అనూహ్యంగా కీవెస్ట్‌ వైపు దారి మార్చుకుని చండప్రచండ వేగంతో  ఫ్లోరిడాపై విరుచుకుపడింది.

ఇర్మా దెబ్బకు ఫ్లోరిడా అతలాకుతలమైంది. వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఒక పక్క పెను తఫాను ఫ్లోరిడాను కుదిపేస్తుంటే మరోవైపు ఒక మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. త్రి ఇడియట్స్ సినిమాలో కంప్యూటర్‌లో డాక్టర్ చెప్పే సూచనలు పాటిస్తు ఆపరేషన్ చేయగా రియల్ లైఫ్‌లో డాక్టర్లు ఫోన్‌లో చెప్పిన సూచనలు పాటిస్తు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బేబికి స్టార్మ్ (తుఫాన్‌)గా పేరు పెట్టారు. తుఫాన్ బీభత్సంలో  వైద్యులెవరూ లేకుండా బిడ్డను కన్న ఆమె ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.  దీంతో ఆ బిడ్డను ఇర్మా బేబీగా అంతా పిలుస్తున్నారు.

ఇదే సమయంలో ‘ఇర్మా’  ఖైదీలకు మాత్రం చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. వందమందికిపైగా ఖైదీలకు విముక్తి ప్రసాదించింది. అట్లాంటిక్ సముద్రంలోని బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్‌లో ఉన్న జైలు పైభాగం ఇర్మా దెబ్బకు ధ్వంసం అవ్వగా.. దొరికిందే సందని సంబరపడిన ఖైదీలు వెంటనే జైలు నుంచి పరుగు పెట్టారు. ఖైదీలు పారిపోతున్నా.. వారిని నిలువరించడం అక్కడి గార్డులకు కష్టతరంగా మారడంతో అలానే చూస్తుండిపోయారు.

- Advertisement -