రన్‌ వే నుండి నదిలోకి…విమానం

228
plane
- Advertisement -

అమెరికాలోని వాషింగ్‌టన్‌లో పెను ప్రమాదం తప్పింది. క్యూబా నుండి అమెరికా వస్తున్న బోయింగ్ 737 విమానం రన్ వే నుండి జారిపోయి నదిలో పడిపోయింది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకువెళ్లిందని అధికారులు తెలిపారు.

విమానం నదిలో మునగకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కొంతమందికి మాత్రం గాయాలయ్యాయని జాక్సన్‌విల్లే మేయర్‌ ప్రకటించారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్‌ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -