నాగశౌర్య కోసం ‘రొమాంటిక్’ బ్యూటీ!

447
Nagashorya Kethiak Sharma
- Advertisement -

టాప్ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అటు దర్శకుడిగా..ఇటు నిర్మాతగా చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు సుకుమార్. నాగశౌర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి సుకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

నూతన దర్శకుడు కాశీ విశాల్ ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈమూవీలో హీరోయిన్గా కేతిక శర్మను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కేతిక శర్మ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రాకముందే మరో అవకాశం రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

- Advertisement -