నిఖిల్ …. ‘కేశవ’ టీజర్‌ టాక్

140
Keshava Official Teaser

‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం కేశవ.  డిఫరెంట్ కంటెంట్ తో రానున్న ఈ సినిమాలో నిఖిల్ డిఫరెంట్ లుక్ తో అదరగొట్టాడు.  సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫస్టులుక్ తోనే అంచనాలు పెంచేసింది. దీంతో ఈ సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాడు నిఖిల్.

ఇక టీజర్ ప్రారంభంలోనే “భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని..”అంటూ గ్రాంథికంగా నెరేషన్ మొదలుపెట్టిన నిఖిల్.. ఆ తర్వాత “స్మరిస్తే పద్యం.. అరిస్తే వాక్యం” అంటూ తన పాయింట్ ని నర్మగర్భంగా చెప్పాడు.  ఆవేశపడితే అతని ప్రాణాలకే ప్రమాదం. ఆ పరిస్థితుల్లో అతను ఒకరిపై రివేంజ్ తీర్చుకోవలసి వస్తుంది. ఆ పగని నిఖిల్ ఎలా కూల్ గా తీర్చుకున్నాడనేదే ఆసక్తి కలిగించాయి.

టీజర్‌లో నిఖిల్ మాత్రం ఎక్కడా ఆవేశపడకుండా.. నిలకడగా తన కేరక్టర్ చేయడం విశేషం. నరికేముందు.. నరికిన తర్వాత కూడా కాసింత కూడా తన ఫీలింగ్స్ ను బయటపెట్టకుండా నిఖిల్ పోషించిన ఈ  పాత్రే మూవీకి అసలైన హైలైట్. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Keshava Official Teaser | Nikhil | Ritu varma | Isha Koppikar | Sudheer Varma | Abhishek Pictures