లేడిస్ హాస్టల్‌లో సైకో…ఏం చేశాడో తెలుసా

146
Psycho in Ladies Hostel

బెంగళూరులో ప్రసిద్ది చెందిన మహారాణి మహిళా కాలేజ్‌లో సైకో వీరంగం సృష్టించాడు.  ఈ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న యువతుల కోసం ప్రత్యేక లేడీస్ హాస్టల్ ఉంది. లేడీస్ హాస్టల్ లో నిత్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు ఉంటాయి. ప్రతిరోజు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని రోజుల నుంచి అర్దనగ్నంగా దస్తులు వేసుకున్న ఓ సైకో లేడీఎస్ హాస్టల్ లో చోరబడి హల్ చల్ సృష్టించాడు.

అర్ధరాత్రి సమయంలో గోడ దూకి హస్టల్ ప్రాంగణంలోకి నగ్నంగా చొరబడి వింత దొంగ చేస్తున్న వికృత చేష్టలకు బిత్తరపోయిన విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు. తాము బయట ఆరేసిన లోదుస్తులు దుండగుడొకడు ఎత్తుకుపోతున్నాడని మహరాణి ఆర్ట్స్, కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12న రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు.

హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడిన దుండగుడు విద్యార్థినుల లోదుస్తులతో వీడియోలో కనిపించాడు. బయట ఆరేసిన లోదుస్తులను తీసుకుని పారిపోతున్నట్టు వీడియోలో రికార్డైంది. ఒకసారి సెక్యురిటీ గార్డు పట్టుకునేందుకు ప్రయత్నించినా తప్పించుకుని పారిపోయాడు. దుండగుడు సైకో అని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. ‘కొద్ది నెలల క్రితం గోడ దూకి అతడు హాస్టల్ లోకి చొరబడడం చూసి విద్యార్థినులు కేకలు పెట్టడంతో అతడు పారిపోయాడు. కొన్నాళ్లు పాటు అతడు మాయమయ్యాడు. మళ్లీ ఫిబ్రవరిలో ప్రత్యక్షమయ్యాడ’ని ఆమె వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.