బాలయ్య-పూరి కాంబో… ‘టపోరి’

150
Its Tapori for Balakrishna

తిట్లు, చీవాట్ల‌ను సినిమాల‌కు టైటిల్స్‌గా పెట్టడంలో పూరి స్టైలే వేరు. పోకిరి,ఇజం,రోగ్,ఇజం,ఇడియట్ వంటి టైటిల్స్‌తో ఆకట్టుకున్న పూరి తాజాగా బాలయ్య సినిమాకు అలాంటి టైటిల్‌నే పెట్టేందుకు సిద్దమవుతున్నాడ. శాతకర్ణి విజయం తర్వాత పూరితో సినిమా చేస్తున్న బాలయ్య సినిమా శరవేగంగా జరుగుతోంది. సినిమా ప్రారంభం రోజే విడుదల తేదీని ప్రకటించిన పూరి టైటిల్‌ పేరులో అదే ప్రత్యేకతను చూపెట్టనున్నాడు.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ని మాత్రం ప్రకటించక పోయినా, ఫిల్మ్ నగర్ సర్కిల్లో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. బాలయ్య కోసం ‘టపోరి’ అనే నెగెటివ్ టైటిల్‌ను ఆలోచించాడట. టపోరి అనేది హిందీ పదం. టపోరి అంటే తెలుగులో రౌడీ అని అర్థం. టైటిల్ క్యాచీగా ఉండడం, చిన్నగా ఉండడంతో పూరీ ఆ టైటిల్ వైపు మొగ్గుచూపుతున్నాడట.

భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ గత చిత్రాలకు ఈ సినిమా భిన్నంగా ఉండనుందట. అందుకే బాలయ్య క్యారెక్టర్‌కు సరిపోయేలా ఈ సినిమాకు టపోరి పేరు సరిపోతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అధికారికంగా మాత్రం ‘టపోరి’ టైటిల్‌ ఇంకా కన్ఫామ్‌ కాలేదు.

ఇక ఈ సినిమా టైటిల్‌ని మెగాస్టార్ చిరంజీవి సాంగ్‌లోంచి లాగేశాడు పూరి. ట‌పు ట‌పు ట‌పోరి .. క‌న్యా కుమారి… అంటూ అప్ప‌ట్లో మెగాస్టార్ సాంగేసుకున్నాడు. బాస్‌ ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఇది. ఈ సాంగ్  లిరిక్ లోంచి `ట‌పోరి`ని పూరి లేపేశాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.