మొక్కలు నాటిన సహాయ ఫాండేషన్ సభ్యులు..

210
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రముఖులు,యువత ఎవరికి వారు స్వతహాగా మొక్కలు నాటడం జరుగుతుంది. ఇందులో భాగంగా సహాయ ఫాండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యులు మొక్కలు నాటారు.మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని దన్నసరి గ్రామ ప్రాధమిక పాఠశాలలో మరియు మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయంలో శుక్రవారం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు తోనుపుణురి సాయి కృష్ణ, నల్ల కిరణ్,షేక్ ఇమ్రాన్, వంగ రాజు యాదవ్,సారణ సతీష్,చరణ్ గౌడ్, ప్రశాంత్, నవనిత్,అరుణ్, గార్ల సాయి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంస్థ వ్యవస్థాపకులు తోనుపుణురి సాయి కృష్ణ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు సమాజానికి ఉపయోగపడే చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకు పోతున్నారని ఆయన ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మండలోని యవతతో మొక్కలు నాటిస్తామని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మండలం లోని ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో ఉండేలా తీర్చి దిద్దుతామని సాయి కృష్ణ అన్నారు.

- Advertisement -