సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజు: చిరు

159

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం పట్ల యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా బాలు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు. బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారని… తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, బాలు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చిరు తెలిపారు.