బాలు మ‌ర‌ణం తీర‌ని లోటు: హ‌రీష్‌, కవిత

148

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం అని మంత్రి హ‌రీష్‌ రావు పేర్కొన్నారు. సినీ లోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది అని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని మంత్రి హ‌రీష్‌ రావు తెలిపారు.

‌తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ గొప్ప గాయ‌కుడిని కోల్పోయింద‌ని టీఆర్ఎస్ మాజీ ఎంపీ క‌విత ట్వీట్ చేశారు. బాలు అసాధార‌ణ క‌ళాకారుడు అని క‌విత పేర్కొన్నారు. బాలు మ‌ర‌ణం తీర‌ని లోటు అని చెప్పారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు క‌విత ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.