ఫీవర్ సర్వే….ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్‌…

41
cs

హైదరాబాద్‌ లో జరుగుతున్న రాపిడ్ ఫీవర్ సర్వే ను అక్ష్మికంగా తనిఖీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్ లో కోవిద్ కౌన్సిలింగ్ సెంటర్ పరిశీలించారు. ఓపి సర్వీస్ ఎలా ఉంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వి, జీహెచ్ ఎంసి కమిషనర్ సోమేశ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జోనల్ కమీషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 707 బృందాలు నేడు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ బృందాలు జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు.