- Advertisement -
కేరళలో జూన్ 9వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం పినరయ్ విజయన్. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ లాక్ డౌన్ తొలగించే దశకు చేరుకోలేదని…కేసులు ఎక్కువగా ఉన్న మల్లప్పురం జిల్లాలో ట్రిపుల్ లాక్డౌన్ను అమలు చేయగా… ప్రస్తుతం అక్కడ సాధారణ లాక్డౌన్ కొనసాగుతుందన్నారు.
తిరువనంతపురంలో 20.21శాతం, పాలక్కాడ్లో 23.86 శాతంగా ఉండగా మిగతా జిల్లాలో 20 శాతానికంటే తక్కుగానే ఉందని విజయన్ తెలిపారు. ఇక ఈ సారి కొన్ని మినహాయింపులు ప్రకటించారు విజయన్.
పారిశ్రామిక సంస్థలు ఉద్యోగుల్లో 50 శాతం మించకుండా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. పారిశ్రామిక సంస్థలకు సరఫరా చేసే దుకాణాలు మంగళవారం, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటల వరకు.. సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
- Advertisement -