వారు బతికుండగా… జగన్‌ను ఓడించలేరు: కొడాలి నాని

31
kodali

చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్‌ను ఓడించలేరని స్పష్టం చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడిన నాని… ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు.

సీఎం జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే చంద్రబాబు,లోకేష్ విమర్శలు చేస్తున్నారని..లోకేష్ ఓ జోకర్..కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారని..పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు.

దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు.