సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండ‌లి భేటీ..

88
cm kcr

తెలంగాణలో క‌రోనా కట్టడిని నియంత్రించ‌డానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్ గ‌డువు ఈరోజుతో ముగియ‌నుంది. దీంతో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్ర‌భుత్వం ఆదివారం నిర్ణ‌యం తీసుకోనుంది. ఈనేపథ్యంలో ఈరోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‎లో మంత్రి మండ‌లి సమావేశం జరగనుంది. ఈ సంద‌ర్భంగా లాక్‎డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వర్షా‌కాల వ్యవ‌సాయ సీజన్‌ వస్తున్న నేప‌థ్యంలో సీఎం కేసీ‌ఆర్‌ వ్యవ‌సా‌య‌రం‌గంపై ప్రత్యే‌కంగా చర్చిం‌చ‌ను‌న్నారు. రైతు‌లకు విత్త‌నాలు, ఎరు‌వులు అందు‌బా‌టులో ఉంచటం, రైతు‌బంధు అంద‌జేత తది‌తర అంశా‌లపై క్యాబి‌నెట్‌ సమా‌వే‌శంలో చర్చించి పలు నిర్ణ‌యాలు తీసు‌కొనే అవ‌కాశం ఉన్నది.