కేరళలోని 1,199 స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం (డిసెంబర్ 13) ప్రారంభమైంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, అధికార లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF) కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగింటిలో ఆధిక్యంలో ఉంది.
త్రిశూర్, కొల్లం, కొచ్చి, కొల్లం మున్సిపల్ కార్పొరేషన్లలో UDF ముందంజలో ఉండగా, భారతీయ జనతా పార్టీ (BJP) కీలకమైన తిరువనంతపురం కార్పొరేషన్‌లో ఆధిక్యంలో ఉంది. అధికార LDF మాత్రం కోజికోడ్ లో మాత్రమే ముందంజలో ఉంది.
రాష్ట్రంలోని మరో 86 మున్సిపాలిటీల్లో కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ కూడా UDF 48 మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో ఉండగా, LDF 30, BJP నేతృత్వంలోని NDA ఒకటిలో మాత్రమే ముందుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం..UDF – 387 వార్డుల్లో ఆధిక్యం,LDF – 283 వార్డుల్లో ఆధిక్యం,NDA (BJP) – 71 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా ఇతరులు – 59 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో తిరువనంతపురం, ఎర్నాకులం, కొల్లం, పథనంతిట్ట, ఆలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో నిర్వహించబడ్డాయి. ఎన్నికైన పంచాయతీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు జరగనుంది.
Also Read:గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

