ఎన్నికల వేల జిల్లాలో దారుణాలు జరుగుతున్నాయి… చాలా అన్యాయంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…. అధికారులు కూడా కాంగ్రెస్ నాయకుల గుంపులో చేరి అక్రమాలు చేస్తున్నారు అన్నారు.
ఎన్నికల కోడ్ వున్నప్పుడు ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరీంచాలి…కానీ అక్రమాలకు పాల్పడుతున్నారు.. అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కలిసి పోయారు.. చేతులు కలిపారు.. brs నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.. కాంగ్రెస్ అంటేనే దౌర్జన్యం, దందా లు..కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.
Also Read:ప్రయాణికుల భద్రత..కీలక ఆదేశాలు!
ప్రతిరోజూ మంత్రులు SP లకు PH లు చేసి ప్రత్యర్థి పార్టీల నాయకులను వేధింపులు చేస్తున్నారు.. అక్రమ కేస్ లు అరెస్ట్ లు చేస్తున్నారు.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు గెల్చేలా కుతంత్రాలు చేస్తున్నారు అధికారులు…..మా అభ్యర్థులు గెలిచిన చోట కూడా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడిలకు భయపడి ఫలితాలు తారుమారు చేస్తున్నారు.. రేపు రెండో విడత పోలింగ్ ఉంది.. అధికారులు చటబద్ధంగా వ్యవహరించాలి అన్నారు. మొదటి విడత లో 45 శాతం మంది BRS సర్పంచ్ లు విజయం సాధించారు…రాబోయే రోజులు అన్ని BRS వే.. ఎన్నిక ఏదైనా ఇకమీదట గెల్చేది గులాబీ జెండానే….ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు గూడు కట్టుకున్నారు..రేవంత్ రెడ్డి పనితనం అర్థం అయింది… ఇక కాంగ్రెస్ వల్ల ఏమి కాదు అని ప్రజలకు అర్థం అయింది.. ఎన్నో దౌర్జన్యలను ఎదుర్కొని brs నాయకులు కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు… విజయడంఖా మోగిస్తున్నారు అన్నారు.

