- Advertisement -
ఎన్నికలు ఏవైనా..ఏ పార్టీ అయినా అసమ్మతి కామనే. అయితే సాధారణంగా టికెట్ రాని వారు పార్టీలు మారడమే,ఆయా పార్టీలకు రాజీనామా చేయడమో లేదా…అదే పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థులను ఓడించడం లాంటివి చేస్తుంటారు..కానీ కేరళలో ఓ కాంగ్రెస్ నాయకురాలు వినూత్నంగా గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు.
కేరళ కాంగ్రెస్ కు చెందిన రాష్ట్ర మహిళా నాయకురాలు లితికా సుభాష్ టికెట్ రాలేదని ఆమె తన పదవికి రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకుంది. ఎత్తుమన్నూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలనుకున్నారు. అయితే లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆమె ఆగ్రహించి పార్టీ కార్యాలయం ముందే గుండు కొట్టించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ తిన్నారు.
- Advertisement -