కాంగ్రెస్ కేరళ యూనిట్ సోషల్ మీడియా చీఫ్ వీటీ బలరాం తన పదవికి రాజీనామా చేశారు. బిహార్ ప్రజలను కించపరిచే విధంగా ఆయన చేసిన కామెంట్సే కారణం. కేరళలోని త్రితాల నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వీటీ బలరాం, ఇప్పటివరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సోషల్ మీడియా మరియు డిజిటల్ సెల్ ఇన్‌చార్జిగా ఉన్న ఆయన, కేపీసీసీ అధికారిక X హ్యాండిల్‌లో బీహార్ గురించి బీడీలతో కలిపి చేసిన వ్యాఖ్యలతో వివాదం తలెత్తిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు.
బీడీలు, బీహార్ రెండూ B తో మొదలవుతాయి. ఇక పాపంగా పరిగణించలేం అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి ఆ తర్వాత తొలగించారు. జీఎస్టీ కౌన్సిల్ బీడీలపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించి, సిగరెట్లపై మాత్రం పెంచిన నిర్ణయం నేపథ్యంలో బలరాం చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. దేశవ్యాప్తంగా బీడీ తయారీలో బీహార్ ప్రధాన కేంద్రాలలో ఒకటి .ఈ పరిశ్రమలో సుమారు 70 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకున్న ఎన్డీయే నేతలు.. బీహార్ రాష్ట్రాన్ని అవమానించారంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
Also Read:పుష్ప 3పై సుకుమార్ క్లారిటీ

