సీపీఎంలోకి కాంగ్రెస్ సీనియర్ నేత..!

46
kerala

కేరళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,కేరళ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ కేపీ అనిల్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను సీపీఎం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి పంపించిన ఆయన గ‌త 43 ఏండ్లుగా పార్టీ కోసం ప‌నిచేశాన‌ని, కానీ ఇప్ప‌టి నూత‌న‌ నాయ‌క‌త్వం త‌న‌ను వెన్నుపోటు పొడిచింద‌ని ఆయ‌న ఆరోపించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు.

ఇటీవ‌ల‌ ఏఐసీసీ చేసిన కేర‌ళ జిల్లా అధ్య‌క్షుల ఎంపిక‌పై అనిల్‌కుమార్ బ‌హిరంగంగా అసంతృప్తి వ్య‌క్తంచేశారు. దీంతో ఆయన్ని పార్టీ నుండి బహిష్కరించగా ఆయన అధికార సీపీఎం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.