కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియగా రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. గత దశాబ్దంగా ఎల్‌డీఎఫ్ పాలనలో ఉన్న కేరళలో ఈసారి పోరు మరింత ఉత్కంఠగా మారింది. 2021లో ఎల్‌డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈసారి కూడా ప్రధాన పోరు ఎల్‌డీఎఫ్ మరియు యూడీఎఫ్ మధ్య జరుగుతుందని భావిస్తున్నారు. అయితే బీజేపీ కూడా తన స్థానం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
సర్వే ప్రకారం సీట్ల అంచనా ఇలా ఉంది:
ఎల్‌డీఎఫ్: 62–68
యూడీఎఫ్: 67–73
బీజేపీ+ (ఎన్‌డీఏ): 5–8
ఇతరులు: 0–3
ఈ అంచనాల ప్రకారం ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య తేడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. హంగ్ అసెంబ్లీ వస్తే ఎన్‌డీఏ కీలక పాత్ర పోషించే అవకాశముంది.
కీలక అభ్యర్థులు
పినరయి విజయన్ – ప్రస్తుత ముఖ్యమంత్రి,ధర్మదం నుంచి పోటీ చేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్న ఆయన, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు.
వీడి సతీశన్ – ప్రతిపక్ష నాయకుడు.పారవూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మార్పు కోసం ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?
బీజేపీ – రాజీవ్ చంద్రశేఖర్…నేమం నుంచి పోటీ చేస్తుండగా, V Muraleedharan కజ్హకూటం నుంచి పోటీ చేస్తున్నారు. కేరళలో పార్టీ బలం పెంచడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది.
ఈసారి కేరళంలో ఎన్నికలు అత్యంత పోటీగా మారాయి. అధికార ఎల్‌డీఎఫ్ మళ్లీ గెలుస్తుందా, లేక యూడీఎఫ్ తిరిగి అధికారంలోకి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూడా కీలక పాత్ర పోషించే అవకాశముండటంతో, ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

