Kerala:అగస్త్య మహర్షి ఆలయంలో పవన్

13
- Advertisement -

కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ఆలయాల సందర్శనలో అకీరా, టిటిడి సభ్యుడు ఆనందసాయి ఉన్నారు.

నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలను సందర్శించనున్నారు పవన్‌. తీవ్రమైన జ్వరం మరియు స్పొండిలైటిస్ నుండి కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్రను ప్రారంభించారు.

ఇవాళ ఉదయం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. తన ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ సంప్రదాయ ధార్మిక వస్త్రధారణలో కనిపించారు. ఇక యాత్ర ముగిసిన వెంటనే తిరిగి తన శాఖల పరిధిలోని సమస్యలను పరిష్కరించనున్నారు.

Also Read:బర్డ్ ఫ్లూ.. తెలంగాణ సరిహద్దులో పోలీసుల తనిఖీలు

- Advertisement -