తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర కీలకం అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీడీ కార్మికులకు కేసీఆర్ పింఛన్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక క్రైమ్ రేట్ 20 శాతం పెరిగిందన్నారు. ఆడబిడ్డలు అభద్రతా భావంలో ఉన్నారు.. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదు అన్నారు.
ఓల్డ్ సీటీలో శివాలయంలో మాంసం వేశారు అంట.. కేసీఆర్ హయాంలో పెట్టిన సీసీ కెమెరాల్లో 70 శాతం పని చేయడం లేదు అన్నారు. మహిళలు భద్రత కోరుకుంటారు.. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు.. ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ ఇచ్చారు,గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల కేసీఆర్ వెయ్యి రూపాయలు ఇచ్చారు అన్నారు.
మానవత్వం లేకుండా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నార… ఢీల్లి నుండి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ వచ్చి ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పారు.. రేవంత్ రెడ్డి మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదు అన్నారు.
Also Read:త్వరలో హరీశ్ రావు పాదయాత్ర!
తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి 35,000 బాకీ పడ్డారు.. సోనియాగాంధీ మొహం చూసి ప్రజలు ఓట్లు వేశారు,రాహుల్ గాంధీ వరంగల్ రాకుండా పారిపోయారు అన్నారు. ఇచ్చిన మాట నిలుపుకొకపోతే తెలంగాణలో ఎక్కడా రాహుల్ గాంధీ తిరగలేని పరిస్థితి వస్తుంది.. మార్చి 8వ తేదీన మహిళా శంఖారావం ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నాం అన్నారు.
మార్చి 8వ తేదీన అసలు సినిమా చూపెడతాము.. ఫ్రీబస్సులో మహిళలకు గౌరవం లేదు.. బస్సుల సంఖ్యను తగ్గించారు అన్నారు కవిత.

