బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్ల తనిఖీలు చేపట్టగా ఆంధ్ర నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి వాటిని తెలంగాణలోకి రాకుండా జాగ్రత్తలు చేపట్టారు.
ఇక ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని శ్రీ బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని సూచించారు వెటర్నరీ అధికారులు.
అధికారుల సూచన మేరకు చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టారు ఫౌల్ట్రీ యజమాని. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read:హోంగార్డులకు జీతాలేవి?: హరీశ్ రావు

