లిక్కర్ స్కాం..సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

22
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన అధికారులు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయస్థానంలో విచారణలో ఉండటంతో తర్వాత హాజరవుతానని చెబుతూ వస్తున్నారు కేజ్రీ. అయితే తాజాగా ఈడీ అరెస్ట్ నుండి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈడీ అధికారుల సోదాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరిపారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ నివాసానికి భారీగా ఆప్ నేతలు చేరుకుంటుండటంతో అన్నిదారులను మూసివేశారు.

Also Read:పుచ్చకాయ నిల్వ ఉంచితే.. ప్రమాదమా?

- Advertisement -