- Advertisement -
దేశరాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఉందని…పలు కంపెనీలు, ప్రభుత్వాలు ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా నిలిపివేశాయన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
కేంద్ర పాలిత ప్రాంతానికి రోజుకు 700 టన్నులు అవసరమని..కేంద్ర ప్రభుత్వం కోటాను 378 టన్నులకు నుంచి 480 టన్నులకు పెంచిందని, అయినా ఇంకా చాలా అవసరమన్నారు.
గత రెండు మూడు రోజులుగా కేంద్రం, ఢిల్లీ హైకోర్టు చొరవతో ఆక్సిజన్ సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కోటా ప్రకారం ఒడిశా నుంచి ఆక్సిజన్ రావాల్సి ఉందని, ఇక్కడికి వచ్చేందుకు సమయం పడుతుందని, అవసరమైతే విమానం ద్వారా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
దేశ రాజధానిలో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
- Advertisement -