ఆప్ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. కేజ్రీవాల్ కూతురు హర్షిత వివాహం ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఘనంగా జరిగింది. హర్షిత తన స్నేహితుడు సంభవ్ జైన్‌ను కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోగా ఆప్ పార్టీ ముఖ్య నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక ఈ వేడుక సందర్భంగా కేజ్రీవాల్, ఆయన భార్య సునీత డ్యాన్స్ చేశారు. పుష్ప-2 సినిమాలోని ‘సూసేకీ’ పాట హిందీ వెర్షన్‌కు కేజ్రీవాల్ దంపతులు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం డ్యాన్స్‌తో అలరించారు.
VIDEO | Visuals of Arvind Kejriwal (@ArvindKejriwal), AAP convenor and former Delhi CM, dancing with his wife, Sunita Kejriwal, at their daughter’s engagement ceremony in Delhi on Thursday.
(Source: Third party)
(Full video on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/oBWXYiExMg
— Press Trust of India (@PTI_News) April 18, 2025
Also Read:TTD:ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

