కేసిఆర్ మరో సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).వైద్యపరీక్షల భారం నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు(Telangana Diagnostics) ముఖ్యమంత్రి చేతకానితనంతో మూలనపడే దుస్థితి నెలకొంది.
కొన్ని చోట్ల సిబ్బంది కొరత, మరికొన్ని చోట్ల 134 టెస్టులకు గాను.. కేవలం 30 నుంచి 40 పరీక్షలు చేసే పరిస్థితికి దిగజారడం దారితప్పిన ప్రభుత్వ వైద్యరంగానికి సంకేతం అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన ఖరీదైన పరికరాలు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
ఇప్పటికే సర్కారు వైద్యమంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. చివరికి పరీక్షలకు కూడా ప్రైవేటు ల్యాబ్ లకు పరుగుతీయడంతో పేదల జేబుకు చిల్లుపడుతోంది…. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టిన డయగ్నోస్టిక్స్ సెంటర్లను పునరుద్ధరించండి అన్నారు. లేకపోతే ఇప్పటికే బక్కచిక్కిన కాంగ్రెస్ సర్కారు.. ఐసీయూకి చేరడం ఖాయం అని హెచ్చరించారు.
Also Read:TTD:ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కేసిఆర్ గారి మరో సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తోంది.
వైద్యపరీక్షల భారం నుంచి పేదలను కాపాడేందుకు పెట్టిన డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు ముఖ్యమంత్రి చేతకానితనంతో మూలనపడే దుస్థితి నెలకొంది.
కొన్ని చోట్ల సిబ్బంది కొరత, మరికొన్ని చోట్ల 134 టెస్టులకు గాను.. కేవలం 30 నుంచి 40… pic.twitter.com/B4CTMhE15G
— KTR (@KTRBRS) April 19, 2025

